తెలంగాణ

మత విద్వేషాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 8: ఆధునిక భారత దేశ నిర్మాణ లక్ష్యంతోనె మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రాలలో చేపట్టే అభివృద్ధి పథకాలన్నిటికీ కేంద్రం సహకరిస్తుందని, మతవిద్వేషాలను రెచ్చగొట్ట్టే బిల్లులను వ్యతిరేకిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బిజెపి ఏర్పాటుచేసిన పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సదస్సులో జవదేకర్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆధునిక భారత దేశ నిర్మాణం దిశలో అభివృద్ధి, డిజిటలైజేషన్ ఎజెండాతో కొనసాగుతుందన్నారు. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ చేపట్టిన చర్యలను ప్రజలు స్వాగతించారని తెలిపారు. మోదీ అభివృద్ధి పథకాలకు దేశ ప్రజలు పట్టం కడుతున్నారని అందుకు ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్, అస్సాం, చండీగఢ్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలె సాక్ష్యమన్నారు.
దేశంలోని 26కోట్ల కుటుంబాలలో 14కోట్ల కుటుంబాలకే గ్యాస్ సౌకర్యం ఉండేదని నరేంద్రమోదీ చేపట్టిన చర్యలతో 6కోట్ల గ్యాస్ కనెక్షన్‌లు పెరిగి 20కోట్లకు చేరడంపట్ల మహిళలు హర్షంవ్యక్తంచేస్తున్నారని అన్నారు. రానున్న రోజులలో ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బిజెపి
బిజెపి మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఏర్పడ్డ టిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో మత విద్వేషాలు పెరుగుతాయని, రాష్ట టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఎంఐఎంతో జతకట్టి ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు పాల్పడుతుందని, బిజెపి ఎట్టి పరిస్థితులలో మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటుందన్నారు. బిజెపి 11కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా అవతరించిందని త్వరలోనే బూత్‌ల వారీగా పార్టీని బలోపేతంచేసి అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించి విజయాలు సాధిస్తామన్నారు. అందుకు యాదాద్రి భువనగిరి సభనుండే కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. జవదేకర్ వెంట రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల అశోక్ తదితరులు ఉన్నారు. జవదేవకర్ యాదాద్రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రిని ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి చేయడం పట్ల ఆయన అభినందించారు.

చిత్రం.. పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్