తెలంగాణ

బ్యాంకుకు బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: నకిలీ పత్రాలతో రుణం పొందిన ఓ ప్రైవేటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సహా ఐదుగురు డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ ఎల్‌బినగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో రూ. 53.81 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడమే కాకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్‌ను మోసగించిన నేరంపై బ్యాంకు అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిబిఐ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ ప్రైవేట్ సంస్థ యజమాని, ఐదుగురు డైరెక్టర్లకు సంబంధించిన ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సిబిఐ పేర్కొంది. హైదరాబాద్, కామారెడ్డిలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ చేసిన టైటిల్ డీడ్, సెక్యూరిటీలతో బ్యాంక్‌ను మోసగించినందుకు ప్రైవేట్ సంస్థ యజమాని సహా ఐదుగురిపై ఐపిఎస్ 120బి, 419, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిబిఐ అధికారులు తెలిపారు.