తెలంగాణ

కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఎన్‌ఎస్‌యుఐ కృషి చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌యుఐ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ఎన్‌ఎస్‌యుఐ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యుఐలో పుట్టిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నారని అన్నారు. కెటిఆర్‌ను ఓ కుర్రకుంకగా అభివర్ణిస్తూ విద్యార్థి సంఘాల్లో పని చేయకుండానే కెటిఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చారన్నారు. టికెట్లను ఆశించే ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్ నేతలంతా నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు ఒడిదుడుకులకు గురవుతోందని, కాంగ్రెస్ వేసిన పునాదులను టిఆర్‌ఎస్ ఛిన్నాభిన్నం చేస్తోందని అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు గాలిలో మేడలు కడుతున్నారని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ రెండూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ల వంటివని అన్నారు. మహిళా కాంగ్రెస్ నామ్‌కే వస్తే పని చేస్తోందని, ఇంకా చురుగ్గా పని చేయాలని కోరారు. తన రాజకీయ జీవితం ఎన్‌ఎస్‌యుఐ నుంచి ప్రారంభమైందని అన్నారు. కెటిఆర్, కవితలకు ఎండ దెబ్బ తగిలి ఇష్టం మొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు మాట్లాడుతూ ఉస్మానియా సెంటినరీ వేడుకలకు అన్నిపార్టీలను ఆహ్వానించాలని, టిఆర్‌ఎస్ సొంత కార్యక్రమంగా చేయడం మంచిది కాదని అన్నారు. తెలంగాణ రావడానికి కెసిఆర్ ఒక్కరే కారణం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడారు.