తెలంగాణ

సాగర్ డ్యామ్ నిర్వహణకు ఆటోమేషన్ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: నాగార్జున సాగర్ డ్యామ్ ఆధునీకరణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీతో గేట్ల నిర్వహణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆటోమేషన్ టెక్నాలజీతో 26 క్రెస్ట్ గేట్లు, 18 ఇతర గేట్లను అవసరం మేరకు నిర్వహించేందుకు ఆధునీకరణ జరుగుతోంది. దేశంలోనే తొలిసారి నాగార్జున సాగర్‌కు ఆటోమేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కంప్యూటరైజ్డ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ డ్యామ్ నిర్వహణ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఈ నియంత్రణ వ్యవస్థ అంతా మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీకి (ఎంసిఎఫ్) అనుసంధానం చేయబడుతుంది. విద్యుత్ ఉత్పాదన, సాగు, తాగు నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అందిస్తూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునీకరించే పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అతిముఖ్యమైన నీటి నిర్వహణకు సంబంధించిన గేట్లను ఎత్తడం, దించడం, నీటి నిల్వల స్థాయిని ఎప్పటికప్పుడు కంప్యూటరైజేషన్ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా ఆటోమేషన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. వరదల సమయంలో భారీ ప్రవాహాన్ని గమనించేందుకు వీలుగా ఈ టెక్నాలజీలో భాగంగా సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కంప్యూటర్ల ద్వారా సమీక్షిస్తారు. సుమారు రూ.8 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపడుతున్న ఈ ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఎంతెంత నీరు విడుదల అవుతోంది, నీటి ప్రవాహ స్థాయి ఏ రోజుకెంత ఉందనే అంశాలు పూర్తిగా ఈ టెక్నాలజీ ద్వారా గమనించేందుకు వీలుంటుంది. ఒక వేళ డ్యామ్‌లో నీటి నిల్వసామర్ధ్యం కన్నా ఎక్కువగా ఉంటే అదికూడా సెన్సార్ల ద్వారా గుర్తించి, అనంతరం ఆటోమేషన్ ద్వారా గేట్లను ఎత్తేందుకు వీలుంటుంది. దీనివల్ల డ్యామ్ భద్రతకు ముప్పు చాలా తగ్గుతుంది. డ్యామ్ నిర్వహణకు సంబంధించిన డేటాను కూడా ప్రాజెక్టు అథారిటీలోని వారు మొబైల్ ద్వారా స్వీకరించే సదుపాయం కూడా ఉంది. జిఎస్‌ఎం, జిఆర్‌పిఎస్ వైర్‌లెస్ టెలిమెట్రీ పద్ధతి ద్వారా మొబైల్ ఫోన్‌కు 5 నిమిషాల నుంచి 24 గంటల వరకు సమాచారాన్ని తీసుకునే వీలుంటుంది. ఆటోమేషన్ విధానం అమల్లోకి రావడంతో మానవ వినియోగం తగ్గుతుంది. కొత్త టెక్నాలజీతో ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్, ఇతర అంశాల్లో చాలావరకు మానవ తప్పిదాలకు అవకాశం తగ్గుతుంది.