తెలంగాణ

టిజెఎసి పోరాటాలకు మేధాపాట్కర్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రజా సమస్యలపై టిజెఎసి చేస్తున్న పోరాటాలకు సామాజికవేత్త మేధా పాట్కర్ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఆదివారం టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నిరుద్యోగులతో టిజెఎసి నిర్వహించాలనుకున్న ర్యాలీని ప్రభు త్వం అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తాను త్వరలో వివిధ ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆమె తెలిపారు.

చిత్రం..కోదండరామ్‌తో సమావేశమైన సామాజికవేత్త మేధాపాట్కర్