తెలంగాణ

యువతకు 100 టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: రానున్న 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రాష్ట్రంలో 100 సీట్లను యువతరానికి కేటాయిస్తామని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాబోయే ఎన్నికల నాటికి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వైపు, కెసిఆర్ కుటుంబం మరో వైపు ఉంటారని అన్నారు. ఆ ఎన్నికల్లో సత్తా చాటడానికి యువతరం సన్నంద్దం కావాలని పిలుపునిచ్చారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం టిడిపి మున్సిపల్, మండల, పట్టణ, డివిజన్ స్థాయి సంస్థాగత ఎన్నికల అధికారుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, ప్రెసిడెంట్ ఎల్.రమణ, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల, కేంద్ర కమిటీ సభ్యుడు ఇ.పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెరాసకు సంస్థాగత నిర్మాణం లేదని అన్నారు. కెసిఆర్‌కు ఉద్యమ అనుభవం కొంతవరకు ఉన్నప్పటికీ పరిపాలన అనుభవం లేదని చెప్పారు. తెరాస 33 నెలల పాలనలో లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఏ గ్రామానికి కూడా ఏమీ రాలేదని రేవంత్ విమర్శించారు. ‘కెటిఆర్ నువ్వు చదివింది గుంటూరులో, ఆ తర్వాత పుణేలో, ఆ తర్వాత అమెరికాలో కాబట్టి స్థానిక నిబంధనల మేరకు చిన్న ఉద్యోగానికీ కూడా నీవు పనికిరావు’ అని విమర్శించారు. కెసిఆర్ కట్టుకున్నది ప్రగతి భవన్ కాదని, పైరవీ భవన్‌గా మారిందని ఎల్.రమణ విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుటుంబ పాలనకు చరమ గీతం పాడినట్లే తెలంగాణలో జరుగుతున్న కుటుంబ పాలనకు అదే గతి పడుతుందని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదని అన్నారు. రావుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ టిడిపికి నాయకత్వ లోటు ఉందని, కానీ ఊటలాగ కొత్త నాయకులు పుట్టుకు వస్తారని అన్నారు. పార్టీ సంస్థాగత కమిటీలకు పటిష్ట నాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.