తెలంగాణ

రైతుల ఉసురు తీసింది మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11:రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల పాటు పాలించి రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, రైతుల ఉసురు తీసింది ఆ పార్టీనేని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఎం నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ విషం కక్కుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. కందిరైతులను ఆదుకున్న ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా నిలిచినట్టు చెప్పారు. మిర్చికి క్వింటాలుకు 7000 రూపాయల కనీస మద్దతు ధర ఇవ్వాలని, ఐదు వందల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు. మద్దతు ధర అంశం రాష్ట్రం చేతుల్లో ఉండదని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా విమర్శిస్తున్నారని అన్నారు. రైతులపై టిఆర్‌ఎస్‌కు ప్రేమ ఉంది కాబట్టే తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్టు చెప్పారు. 17వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినట్టు తెలిపారు. ఎంబిసిల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించినట్టు చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఇవి కనిపించడం లేదని అన్నారు. కమ్యూనిస్టుల మ్యానిఫెస్టో కన్నా కెసిఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అన్నారు. తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం గురించి మాట్లాడడం నేతిబీర కాయ చందంగా ఉందని , 60 ఏళ్లలో ఒకే సామాజిక వర్గానికి పదవులు తప్ప మరో సామాజిక వర్గాన్ని పట్టించుకోని కమ్యూనిస్టులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
70లక్షలు దాటిన సభ్యత్వం
టిఆర్‌ఎస్ సభ్యత్వం 70లక్షలు దాటిందని, ప్రజల్లో అద్భుతంగా స్పందన ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గతంలో 50లక్షల సభ్యత్వం ఉండేదని చెప్పారు. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీకి 20 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. గ్రామ, మండల కమిటీల ఏర్పాటు క్రమ శిక్షణతో జరుగుతున్నాయని చెప్పారు.