తెలంగాణ

ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉపాధి హామీ పథకానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.940 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో జూపల్లి సమావేశంమై రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. అనంతంరం జూపల్లి విలేఖరులతో మాట్లాడుతూ 1469 కి.మీ రహదారులకు సంబంధించి రూ.899 కోట్లు ఈ నెలలో బృందాన్ని పంపి పరిశీలించి మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించినట్టు తెలిపారు.
పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ నుంచి కేవలం పంచాయతీలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని, మండలాలకు, జిల్లాకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. అలాగే స్ర్తినిధి రుణాల నిమిత్తం వడ్డీ రాయితీలు పెంచాలని కేంద్రమంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు.