తెలంగాణ

బిసిల ప్రయోజనాలకు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: మైనారిటీ రిజర్వేషన్ల అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బిసిల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉందని టిడిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరికి న్యాయం చేయడానికి నలుగురికి అన్యాయం చేస్తారా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం బిసిల హక్కులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 16న జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనే రజకులను ఎస్సీలలోకి, కాయితీ లంబాడీలు, వాల్మీకి బోయ, వడ్డెరలను ఎస్టీలలోకి చేర్చాలనే అంశాలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బిసిలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటిసి, ఎంపిపి, జిల్లాపరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల్లోకి రాగలిగారని గుర్తు చేశారు. అటువంటి బిసిల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మరో వర్గానికి రిజర్వేషన్లు కల్పించితే మరో సామాజిక పోరాటం తప్పదని అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 50 సీట్లను బిసిలకు కేటాయించగా వాటిలో 30 స్థానాలను ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బిసి ఇ వర్గీయులే పోటీ చేసి గెలిస్తే, కేవలం 20 చోట్ల మాత్రమే అసలైన బిసిలు గెలిచారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన కొత్త రిజర్వేషన్ల ప్రక్రియ అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో కూడా ఇదే పద్ధతిలో బిసిలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ అంశంపై తెలంగాణలోని మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, సభలోనూ, బయటా ఈ అంశంపై చర్చ జరగాలని కోరారు.