తెలంగాణ

తమిళనాడు తరహాలో ముస్లింలకు కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్టే తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచుకుంటామన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడానికి మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో గురువారం మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముస్లిం, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో ఏలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ చేస్తున్న కృషికి గుర్తింపుగానే వారిని తిరిగి ఎమ్మెల్సీలుగా ప్రకటించామన్నారు. మంత్రిమండలి మొత్తంగా వీరి అభ్యర్థిత్వాన్ని సమర్ధించారని ముఖ్యమంత్రి చెప్పారు.

చిత్రం..గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు