తెలంగాణ

బిజెపిలో చేరడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తాము బిజెపిలోకి వెళ్ళబోమని కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమను, కాంగ్రెస్‌ను బలహీనపరచాలన్న ఉద్దేశ్యంతో కొంత మంది తెరాస నాయకులతో పాటు తమ పార్టీలోనూ కొంత మంది గిట్టని వారు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్వర్యంలో పనిచేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాను, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.