తెలంగాణ

ముస్లింలు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బిసిలకు, దళితులకు కూడా వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు క్రీమిలేయర్ అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎన్నికల హామీ అమలులో భాగంగా వాల్మీకి బోయలను, ఖాయితా లంబాడీలను ఎస్టీల్లో కలపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ అంబేద్కర్ శకం దేశంలో మొదలైందని అన్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక విప్లవం రావాలంటే అంబేద్కర్ భావజాలమే దిక్కు అనే తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ నమ్మారని తెలిపారు. సామాజిక న్యాయానికి పునాది వేసింది కాంగ్రెస్ అని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీని విస్మరించి, దళితుడిని సిఎంను చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారని ఈ సందర్భంగా రవి విమర్శించారు. అంబేద్కర్ పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబేద్కర్ ఆలోచనా విధానంతో పాలన సాగించాలని హితవు పలికారు. మూడేళ్లలో 400 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి 3600 మంది దళితులకు మాత్రమే భూమిని ఇచ్చారన్నారు. దళితుల జనాభా 18 శాతం ఉంటే, ఎంత మందికి ఇంతవరకు ఈ హామీని అమలు చేశారో వివరించాలన్నారు. ఈ నెల 20వ తేదీన తాండూరులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ సభకు హాజరవుతారన్నారు.