తెలంగాణ

సండ్ర, రేవంత్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ అసెంబ్లీ గేటు బయట బైఠాయించి నిరసన తెలిపి, రోడ్డుపైకి వస్తున్న టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుదలపై బిల్లును ఆమోదించేందుకు ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నామంటూ టిడిపి ఎమ్మెల్యేలు ఏ రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుంచి ర్యాలీగా రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగంలో హక్కు ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు, రాజ్యాంగ సవరణ అవసరమైన ముస్లిం రిజర్వేషన్లను ఒకే బిల్లులో ప్రవేశపెట్టడం వెనుక సీఎం కెసిఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచేందుకు ఇష్టంలేకనే సీఎం ఈ కుట్ర పన్నారన్నారు. బిసిలలో కేవలం బిసి-ఇలకు మాత్రమే రిజర్వేషన్లు పెంచడం సమంజసం కాదన్నారు. బిసిలలోని ఏబిసిడి వర్గీయులకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పెడితే బిసిలందరికీ మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అరెస్టయిన వారిలో మాజీ మంత్రి బోడ జనార్ధన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు.