తెలంగాణ

సింగరేణికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఏప్రిల్ 17: సింగరేణి యాజమాన్యానికి వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూసిన సుమారు 30వేల మంది నిరుద్యోగులను సుప్రీం కోర్టు నిర్ణయం నిరాశ పరిచింది. సింగరేణి యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి న్యాయ స్థాన నిర్ణయం చేదు అనుభవాన్ని మిగిల్చింది. వారసత్వ ఉద్యోగాల నియామకాలను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్ అనే నిరుద్యోగి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేయగా, హైకోర్టు దానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పును ఇచ్చింది. దీనితో సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియమకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహం బెడిసికొట్టినట్టైంది. 18సంవత్సరాల క్రితం రద్దైన సింగరేణి వారసత్వ ఉద్యోగాల నయమకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్‌లో ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపింది. తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు బ్రహ్మరథం పట్టారు. సింగరేణిలో 30వేల వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో సింగరేణి విస్తరించి ఉన్న ఐదు జిల్లాలోని 11 ఏరియాలకు చెందిన కార్మిక వర్గాలు గంపెడు ఆశతో ఎదురు చూశాయి. సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాల నియమకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ దశలో నిరుద్యోగి సతీష్ హైకోర్టును ఆశ్రయించగా, అతడికి అనుకూలంగా తీర్పు రావటం సింగరేణి వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యానికి మార్చి 31వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చాయి. సింగరేణిలో సమ్మె కొనసాగించేందుకు జాతీయ కార్మిక సంఘాలు సన్నద్ధం అవుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో కూడా వారసత్వ ఉద్యోగాలపై యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కంగు తిన్నాయి. ఈనేపథ్యంలో సింగరేణిలో సమ్మె అనివార్యం అయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి.