తెలంగాణ

వర్శిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్ యోచిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. విశ్వవిద్యాలయాలను కాషారుూకరణ చేసే దిశగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య కేంద్రం చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 22న కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, విద్యార్థులను వాహనాల్లో ఎక్కించుకొని నగరం చుట్టూ తిప్పుతూ విచక్షణ రహితంగా కొట్టారని ఆయన ఆరోపించారు. హెచ్‌సియూలో అకారణంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి జరిపారని, ఈ ఘటనలో పోలీసులు విద్యార్థినులను అసభ్యకరంగా దూషిస్తూ ఈడ్చుకెళ్లారని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ పిలుపు మేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని డిపో, యూనిట్ల వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో రావలసిన రూ. 200 కోట్లు రాకపోవడంతో ఆర్టీసి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని యూనియన్ నాయకులు కె భాస్కర్, బాబు, అజీజ్ పాషా అన్నారు. 2014-15 బడ్జెట్ అయిపోయినందున నెలకు రూ. 75 కోట్లు ఇస్తామన్న సిఎం కెసిఆర్ ఆచరణలో విఫలమయ్యారని వారు విమర్శించారు. నాలుగు నెలలైనా రావలసిన నిధులు రాకపోవడం, ఆర్టీసి బైఫరికేషన్ జరగక పాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోందని వారు ఆరోపించారు. ఆర్టీసికి వెంటనే రూ. 300 కోట్లు విడుదల చేయాలని, బైఫరికేషన్ చేస్తూ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.