తెలంగాణ

మిషన్ కాకతీయతో రైతులకు పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పునర్‌వైభవం చేకూరుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, చెరువులు నీటితో నిండటంతో రైతులకు పండగవాతావరణం నెలకొని ఉంటుందని నీటిపారుదల మంత్రి టి. హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ మీడియా అవార్డులను బుధవారం ఆయన జలసౌధలో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న పలు చర్యల్లో మిషన్ కాకతీయ అత్యంత ముఖ్యమైందని గుర్తు చేశారు. సిఎం ఆలోచనలకు ప్రతిరూపమే మిషన్ కాకతీయ అని తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల పంటలకు సాగునీరు అందడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టం పెరుగుతుందని, మనుషులకు, జంతువులకు తాగునీరు కూడా లభిస్తుందని వివరించారు. మిషన్ కాకతీయ వల్ల ఈ ఏడు 4.30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. మిషన్ కాకతీయపై జర్నలిస్టులు అద్భుతమైన వార్తలు, వ్యాసాలు రాశారన్నారు. మిషన్ కాకతీయ లాంటి ప్రజోపయోగకరమైన అంశాలకు జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తొమ్మిది గంటలపాటు వ్యవసాయ బావులకు కరెంటు ఇస్తుండటంతో ఈసారి పంటల దిగుబడి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిందన్నారు. వచ్చే ఏడాది ఉత్తమ ఫోటోగ్రాఫర్లు, ఉత్తమ కెమెరామెన్లకు అవార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.