తెలంగాణ

భగ్గుమన్న భానుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఎండాకాలం ప్రారంభమైన తర్వాత బుధవారం భానుడు (సూర్యుడు) భగ్గుమన్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం గిలగిలలాడారు. ఉదయం తొమ్మిది గంటల నుండే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకూ ఎండ తీవ్రత తీక్షణంగా ఉంటోంది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని వివిధ జిల్లాల్లో చాలా మంది వడదెబ్బకు గురయ్యారు. వడదెబ్బకు కొంత మంది మరణించినప్పటికీ, అది అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. తలనొప్పి, జ్వరం తదితర అనారోగ్యాలకు గురవుతున్నవారు ఆసుపత్రులకు పెద్దఎత్తున వస్తున్నారు. బుధవారం చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటింది. మహబూబ్‌నగర్‌లో మంగళవారం 45 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, బుధవారం 44 డిగ్రీలు నమోదయింది. బుధవారం ఆదిలాబాద్ టాప్‌లో నిలిచి, 45 డిగ్రీల సెల్సియన్ నమోదైంది. ఎపిలో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు కర్నూలులో, 43 డిగ్రీలు తిరుపతి, అనంతపురంలలో నమోదుకాగా, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44 డిగ్రీలు నమోదయింది.
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో బుధవారం అక్కడక్కడ చిరుజల్లులు కురవగా, ఎపి, తెలంగాణలలో మాత్రం ఎక్కడా వర్షం ఛాయలు కనబడలేదు. రాయలసీమ, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, కోస్తాంధ్రలో గురువారం పొడి వాతావరణం ఉన్నప్పటికీ, ఆ తర్వాత మూడు రోజుల పాటు అక్కడక్కడా చిరు జల్లులు లేదా చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళ జన సంచారం చాలా తక్కువగా ఉంటోంది. హైదరాబాద్ తదితర నగరాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం పదిగంటలలోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒకేసారి జనం తమ వాహనాలతో రోడ్లపైకి వస్తుండటంతో ట్రాఫిక్ జాం అవుతోంది. ఎండ ఎక్కువగా ఉండటంతో జనం అల్లల్లాడుతున్నారు.

ఉభయ రాష్ట్రాల్లో బుధవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి
నగరం గరిష్ట ఉష్ణోగ్రత
(సెల్సియస్‌లలో)
హైదరాబాద్ 42
ఆదిలాబాద్ 45
భద్రాచలం 42
హన్మకొండ 41
ఖమ్మం 41
మహబూబ్‌నగర్ 44
మెదక్ 43
నల్లగొండ 43
నిజామాబాద్ 44
రామగుండం 42
విజయవాడ 38
విశాఖపట్నం(ఎపి) 36
అనంతపురం 43
ఆరోగ్యవరం 40
కడప 42
కర్నూలు 44
నంద్యాల 42
తిరుపతి 43
నెల్లూరు 40
కాకినాడ 36
మచిలీపట్నం 35