తెలంగాణ

‘లీకు’ వీరుడు ఎమ్సెట్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక సూత్రధారి శివ బహదూర్ సింగ్, అతని అనుచరుడు అనూప్‌కుమార్ సింగ్‌లను తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈనెల 14న శివ బహదూర్ సింగ్ (ఎస్‌బి సింగ్), అనూప్‌కుమార్‌లు ఉత్తరప్రదేశ్‌లో జాన్‌పూర్‌లోని ఓ లాడ్జిలో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు చిక్కిన ఎస్బీసింగ్ విచారిస్తే ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్టేనని అదనపుడిజిపి (సిఐడి) గోవింద్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్బీసింగ్ 2005 నుంచి పలు ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించినట్టు తొమ్మిదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 12 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్టు తెలిపారు.
* 2005లో రైల్వే గ్రూప్-డి, పిఎస్, ఎస్‌టిఎఫ్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడు (లక్నో-ఉత్తరప్రదేశ్)
* 2008లో రైల్వే డ్రైవర్ల నియామకపు పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ (అలహాబాద్) కేసులో నిందితుడు
* 2015లో పంజాబ్‌లో టెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు, పిఎస్‌సి పరీక్ష లీకేజీ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడు
* 2015లో జమ్మూ, కాశ్మీర్ టీచర్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఐదు కేసులో నిందితుడు. కోల్ ఇండియా కేసులో నిందితుడు.
* మహారాష్టల్రోని వార్ధా మెడికల్ కళాశాల పేపర్ లీకేజీ, చండీగఢ్ టీచర్స్ ఎగ్జామినేషన్ లీకేజీ, కోల్‌కతా టెట్ ఎగ్జామినేషన్ లీకేజీ కేసులోనూ నిందితుడు.
* 2016 డిసెంబర్ డిఎంఆర్‌సి ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ, తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుడని సిఐడి డిజిపి పేర్కొన్నారు. కాగా, ఎస్బీసింగ్, అతని అనుచరుడు అనూప్‌కుమార్‌ను గురువారం కోర్టు అనుమతిలో కస్టడీలోకి తీసుకోనున్నట్టు తెలిసింది.