తెలంగాణ

విద్యాలయాల్లో విద్రోహ చర్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: విశ్వవిద్యాలయాల్లో దేశ ద్రోహ చర్యలను కఠినంగా అణిచివేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై శనివారం శాసన సభలో హోంమంత్రి ప్రకటన చేశారు. అనంతరం జరిగిన చర్చలో బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశ విచ్చిన్నకర కార్యకలాపాలకు పాల్పడతాము అనే వారి పట్ల కఠినంగా ఉండాలని కోరారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారికి సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధిస్తే, విశ్వవిద్యాలయాల్లో ఆ ఉగ్రవాది జన్మదిన వేడుకలు జరుపుతుంటే ఎవరు ఊరుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు 12వందల మంది వరకు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాని ఢిల్లీ నాయకులు గల్లీకి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం పెంచడానికి ప్రయత్నించారని రాహుల్‌గాంధీ పర్యటనను ప్రభాకర్ పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రులు, ఢిల్లీ నాయకుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఎంతో మంది యువత ఉద్యమ కాలంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గొంతుపై కత్తిపెట్టి భయపెట్టినా భారత్‌మాతాకు జై అని పలకను అంటూ ఒక ఎంపి ప్రకటించడం సబబు కాదన్నారు. విద్వేషపూరిత ఉపన్యాసాల ద్వారా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.