తెలంగాణ

ఉద్యమాలతోనే సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: మత ప్రాతిపదికపై రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలతో సమాధానం చెప్పాలని బిజెపి యోచిస్తోంది. ఇందుకు ప్రారంభ సూచకంగా సోమవారం రాష్టవ్య్రాప్తంగా బిజెపి నిరసన ప్రదర్శనలు చేపట్టింది. 20వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు, ధర్నాలు చేపట్టనుంది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది. రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎలుగెత్తి చాటడం, కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు టిఆర్‌ఎస్ నేతలు బిజెపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి త్రిముఖ వ్యూహంతో బిజెపి ప్రణాళిక రచిస్తోంది.
ఇటీవలి ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఊహించిన దానికంటే మించి బిజెపికి అనుకూలంగా ఫలితాలు రావడంతో రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించింది. తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ను కంగుతినిపించి పరుగుపెడుతున్న బిజెపి స్థానిక ప్రాంతీయ పార్టీలపై దృష్టి పెట్టింది. దేశం నలుమూలల కాషాయ జండా రెపరెపలు ఎగురవేసే ఉత్సాహంలో నాయకులున్నారు. కాంగ్రెస్ నుండి దేశానికి విముక్తి కల్పించండి అంటూ 2014లో బిజెపి నేతలు ఉపయోగించిన నినాదం అపుడు బాగానే పనిచేసింది. ఎన్‌డిఎలో మిగిలిన పార్టీలపై ఆధారపడకుండానే లోక్‌సభలో 282 సీట్లను సాధించింది. కాంగ్రెస్ కేవలం నేడు ఐదు రాష్ట్రాలకే పరిమితం కాగా, బిజెపి కేంద్రంతో పాటు 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, మరో నాలుగు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. దేశంలో 75 శాతం భూభాగం, జనాభాలో 60 శాతం మేర బిజెపి ఆధిపత్యం వహిస్తోంది.
అయినా బిజెపి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్ధే ముఖ్యమంత్రిగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అలా జరిగినపుడే పంచాయతీ నుండి పార్లమెంటు వరకూ బిజెపి ఏలుబడిలోకి వస్తుందని నేతలు భావిస్తున్నారు. అపుడే బిజెపి స్వర్ణయుగం ప్రారంభమైనట్టు అని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతలకు నూరి పోస్తున్నారు. 2014లో బిజెపికి వచ్చింది 31 శాతం ఓట్లు మాత్రమే. అయితే ఇంత తక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తొలి పార్టీ కూడా బిజెపియే. ఈశాన్యంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడంతో పాటు దక్షిణాదిలో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, తూర్పున బెంగాల్‌లో పార్టీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నారు. తెలంగాణలో సొంతంగా పోటీ చేయాలని, ఆంధ్రాలో టిడిపితో కలిపి పోటీచేసినా మెజార్టీ సీట్లకు పోటీచేయాలని బిజెపి యోచిస్తున్నట్టు సమాచారం.