తెలంగాణ

వడగాడ్పులకు జనం విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20:వడగాడ్పులకు తెలంగాణ విలవిల్లాడుతోంది. ఈ ఏడాది ఇంతవరకు 42 మంది మృతి చెందినట్టు అంచనా. కరీంనగర్ జిల్లాలో 10 మంది, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, కామారెడ్డిలో ఇద్దరు చొప్పున, ఇతర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది. రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతుండటంతో జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ శాఖ ఖరారు చేసిన వేసవి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు.మరో 45 రోజులపాటు వడగాడ్పులు వీచే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడగాడ్పుల వల్ల ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది.