తెలంగాణ

ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్‌తో హర్యాణ-తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, చారిత్రక, భాషా సంబంధాలు పటిష్టమవుతాయని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. భిన్న సంస్కృతులు కలిగి ఉన్న భారత దేశంలో రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాన చేపట్టిన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. గురువారం నాడిక్కడ హర్యాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో వెంకటేశం సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణ, హర్యాణ రాష్ట్రాల మధ్య 27 అంశాలపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వెంకటేశం తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పండుగలను హర్యాణలో నిర్వహించడం, హర్యాణ పండుగలను తెలంగాణలో నిర్వహించుకోవడం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు మరింత విస్తృతం అవుతాయన్నారు. హర్యాణ కళాకారులకు తెలంగాణ నృత్యం లంబాడ డ్యాన్స్ నేర్పించడం, హర్యాణ డ్యాన్స్ గుమార్‌ను తెలంగాణ కళాకారులు నేర్చుకున్నారని తెలిపారు. అక్టోబర్‌లో తెలంగాణలో హర్యాణ రాష్ట్ర ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు హర్యాణ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. హర్యాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల బృందం ఈ నెల 24న రాష్ట్రంలో పర్యటించి కాఫీ టేబుల్ బుక్ రూపొందిస్తుందని అన్నారు. త్వరలో తెలంగాణ నుంచి ఫోటో గ్రాఫర్ల బృందం హర్యాణలో పర్యటించి కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందిస్తారని వెంకటేశం వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం ఎండి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, టూరిజం కమిషనర్ సునీతా భగవత్, హర్యాణ రాష్ట్ర ఉన్నత విద్య డైరక్టర్ ఎ.శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పాల్గొంది.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లోని టూరిజం కార్యాలయంలో అధికారులతో భేటీ అయన కార్యదర్శి వెంకటేశం