తెలంగాణ

అసెంబ్లీలో ముగ్గురు ఒఎస్‌డిల పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: సచివాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి)గా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులతో పాటు ఉర్దూ లైజాన్ అధికారి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఓఎస్‌డిలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హెచ్‌ఎ.షఫీ, ఎ..రాంరెడ్డి, ఎ.చంద్రభాగ, ఉర్దూ లైజాన్ అధికారి మహ్మద్ జహీరుద్దీన్‌ల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మండలి కార్యదర్శి రాజా సదారామ్ వారికి పలు బాధ్యతలు అప్పగించారు. ఎ.చంద్రభాగకు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం, జిరో అవర్, పిటీషన్ల కమిటీ, అస్యూరెన్స్‌ల కమిటీ బాధ్యతలు అప్పగించారు. రాంరెడ్డికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, షఫీకి ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ (కౌన్సిల్), జహీరుద్దీన్‌కు మైనారిటీ సంక్షేమం, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై ఏర్పాటైన సభా సంఘం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.