తెలంగాణ

టి.జాక్ బలోపేతానికి ‘కోదండ’ చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: టి.జెఎసి బలోపేతానికి చైర్మన్ కోదండరామ్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. టి.జెఎసి నుంచి ఇరువురు నేతల బహిష్కరణ తర్వాత బలహీనపడిందన్న ప్రచారం జరుగుతున్నది. దీనిని దూరం చేస్తూ, కింది స్థాయినుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు నగర శివారులోని ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. 31 జిల్లాల నుంచి జిల్లా స్థాయి ఆఫీసు బేరర్లు ఈ తరగతులకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ ‘చలో ఇందిరా పార్కు’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమించేందుకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, ప్రజలను కలుపుకుని పోరాటం చేసేందుకు ఈ శిక్షణా తరగతుల్లో ఆయన చిట్కాలు చెప్పనున్నారు. ఉద్యమం సమయంలో విద్యార్థులకు, ఉద్యమకారులకు అనేక సూచనలు చేస్తూ ముందుకు నడిపించినట్లే ఇప్పుడూ ఉద్యమ దిశగా టి.జెఎసిని నడిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ భావిస్తున్నారు.