తెలంగాణ

‘ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఒక్కటే సరైన మార్గమని ఎంపి కె.కవిత అన్నారు. వాణిజ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శనివారం హైదరాబాద్ విచ్చేసింది. కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కమిటీలో సభ్యురాలుగా ఉన్న ఎంపి కవిత మాట్లాడుతూ దేశీయంగా పసుపునకు డిమాండ్ అధికంగా ఉన్నా, నాణ్యంగా ఉన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఆక్షేపించారు. పసుపు రైతులకు పూర్తి న్యాయం జరగాలంటే పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పలువురు పసుపు రైతులు కమిటీ ప్రతినిధులను కలిశారు. తమ సమస్యలను వారికి విన్నవించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్, జీవన్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.