తెలంగాణ

దండకారణ్యంలో భద్రతా సలహాదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 26: జాతీయ భద్రతా సలహాదారు, సీఆర్‌పీఎఫ్ మాజీ డీజీపీ, కిల్లర్ వీరప్పన్ ఆపరేషన్ సారథి విజయ్‌కుమార్ శనివారం దండకారణ్యంలో పర్యటించారు. తొలుత శుక్రవారం రాత్రి భద్రాచలం చేరుకున్న ఆయన స్థానిక సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ గ్రేహౌండ్స్ డీఐజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు, గత ఏడాది కాలంగా ఆపరేషన్ గ్రీన్‌హంట్ వల్ల వచ్చిన ఫలితాలు, జవాన్ల పరిస్థితి అన్నీ కూలంకషంగా సమీక్షించారు. రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హెలీకాప్టర్‌లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఛత్తీస్‌గఢ్ డీజీపీతో పాటు అబూజ్‌మాడ్ ప్రాంతం జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. బస్తర్ దండకారణ్యంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఇటీవల ఛత్తీస్‌గఢ్ పోలీసులు సాధించిన విజయాలపై అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. మావోయిస్టులపై పోరుకు సరిహద్దు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లు ఎక్కువగా చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన సూచించినట్లు సమాచారం. ఇదే వరవడిని కొనసాగించడంతో పాటు మావోయిస్టులతో పోరుకు జవాన్ల వ్యూహాలు ఎప్పటికపుడు కొత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. సమీక్ష కోసం విజయ్‌కుమార్ భద్రాచలం రావడం ఇది రెండోసారి.

భద్రాద్రి రామయ్య సేవలో సింగరేణి
భద్రాచలం, మార్చి 26: శ్రీ సీతారామచంద్రస్వామికి సింగరేణి సంస్థ విరాళం ప్రకటించింది. గతంలోనే దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆలయాభివృద్ధికి ప్రతిపాదనలతో విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సీఎండీ శ్రీ్ధర్ దేవస్థానం అభివృద్ధికి రూ.50 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. వాటితో భక్తుల కోసం 8 గదులు ఆలయ సమీపంలో నిర్మించాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం సింగరేణి కార్యాలయం నుంచి దేవస్థానానికి సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 15న మిథిలా స్టేడియంలో జరిగే కల్యాణ మహోత్సవంలో వీవీఐపీ టిక్కెట్ ధర రూ.3వేల నుంచి రూ.2వేలకు తగ్గిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసిన దేవస్థానం మిథిలాప్రాంగణంలో చలువ పందిళ్ల నిర్మాణం, ఆలయానికి రంగులు వేసే పనులు వేగవంతం చేశారు.

పేలిన చార్జర్
యువకుడు దుర్మరణం
బి కొత్తకోట, మార్చి 26: సెల్ చార్జింగ్ పెడుతుండగా పేలి ఓయువకుడు దుర్మణం చెందన సంఘటన శనివారం రాత్రి చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలో జరిగింది. బి కొత్తకోట మండలం బడికాయలపల్లి గ్రామం పూరపవారిపల్లెకు చెందిన నామాల వెంకటరమణారెడ్డి కుమారుడు ఎన్ వెంకటశివారెడ్డి వృత్తిరీత్యా వ్యవసాయ కూలి. అతను శనివారం రాత్రి ఇంట్లో సెల్‌కు చార్జింగ్ పెట్టాడు. అది వెంటనే పేలడంతో అతను అపస్మారక స్థితిలోకి చేరాడు. కుటుంబ సభ్యులు వెంటనే ట్రాక్టర్‌లో బి కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే మృతిచెందాడు. దీనిపై ఎస్సై శివప్రసాద్‌రెడ్డి కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.