తెలంగాణ

కోదండరామ్ కొత్త పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30న సన్నాహక కమిటీ భేటీ
రెండు నెలలపాటు బస్సు యాత్ర
అసంతృప్తివాదులకు ఆహ్వానం
గాదె ఇన్నయ్య నేతృత్వం

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెరాస పట్ల అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాలతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2001లో తెరాస ఏర్పడినప్పుడు కీలకపాత్ర వహించి ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించిన గాదె ఇన్నయ్య, కోదండరామ్ కొత్త పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లో సన్నాహక కమిటీ సమావేశం జరుగుతుంది. రెండు నెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తామని, అనంతరం సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పార్టీ ఏర్పడుతుందని గాదె ఇన్నయ్య
తెలిపారు. మొత్తం 31 జిల్లాల నుంచి సన్నాహక కమిటీ సమావేశానికి ప్రతినిధులను ఆహ్వానించారు. ఇద్దరి నుంచి ఐదుగురి వరకు ఒక్కో జిల్లానుంచి హాజరు కావాలని కోరారు. సన్నాహక కమిటీ సమావేశం అనంతరం పార్టీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తారు. అదేవిధంగా పార్టీ ఏవిధంగా ఉండాలో నివేదిక రూపొందిస్తారు. వార్డుస్థాయి నుంచి ఎంపీ స్థానం వరకు పోటీ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఇన్నయ్య చెప్పారు. రెండునెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించి, రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశానికి కారణాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్‌లో పార్టీని ప్రకటిస్తారు. అప్పటివరకు కోదండరామ్ జెఏసి కార్యకలాపాలు నిర్వహిస్తారు. పార్టీ ఏర్పాటుకు సన్నాహక కమిటీ ఒకవైపు ఏర్పాట్లు చేస్తుండగానే, మరోవైపు కోదండరామ్ జెఏసి కార్యకలాపాలు కొనసాగిస్తారు. సెప్టెంబర్‌లో పార్టీ ఏర్పాటు నిర్ణయం తరువాత కోదండరామ్ జెఎసి నుంచి బయటకు వచ్చి పార్టీకి నాయకత్వం వహిస్తారు. సన్నాహక కమిటీ సమావేశంలో జెఎసిలోని నాయకులు కూడా పాల్గొంటారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలు ఉద్యమించాయని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ వైఖరి వల్ల ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు కెసిఆర్‌కు దూరం అవుతున్నాయని, ఈ వర్గాలను కొత్తపార్టీలోకి ఆహ్వానిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా తెరాస అసంతృప్తి వాదులపై దృష్టి సారించారు. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి నుంచి 45 రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజల స్పందన, అసంతృప్తివాదుల నుంచి వచ్చిన స్పందన చూసి ఏవిధంగా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.