తెలంగాణ

అసెంబ్లీలో అంబలి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు చల్లదనంకోసం శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వైపు మొగ్గుచూపుతారు. అయితే అనాదిగా ‘అంబలి’కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం అసెంబ్లీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న అంబలి కేంద్రాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అంబలి సేవించడం ఆరోగ్యానికి మంచిదంటూ వారు కోనప్పను అభినందించారు. కోనప్ప మాట్లాడుతూ త్వరలో నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో అంబలి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
విఐపి గ్యాలరీలో కవిత
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత శనివారం అసెంబ్లీని సందర్శించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీ విఐపి గ్యాలరీలో ఆమె సుమారు గంటసేపు కూర్చుని అసెంబ్లీ సమావేశాలను తిలకించారు. ఆమెవెంట ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఉన్నారు. ఆ తర్వాత వారిరువురూ విడిగా కవితతో కొంత సేపు చర్చించారు.
ప్యానెల్ స్పీకర్‌గా గీతారెడ్డి
అసెంబ్లీలో హెచ్‌సియు గొడవపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. అయితే మధ్యాహ్నం కావడంతో ఆమె భోజనానికి వెళ్ళేందుకు వీలుగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డిని ప్యానల్ స్పీకర్‌గా కూర్చోబెట్టి వెళ్ళారు.