ఆంధ్రప్రదేశ్‌

మోదీ మాటిచ్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 25: వచ్చే ఎన్నికలకు ముందే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆ మేరకు నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లిన తనకు ప్రధాని నరేంద్రమోదీ మాటిచ్చారని తెలంగాణ టిడిపి నేతలకు బాబు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం రెండోరోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మరికొద్ది నెలల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ మేరకు ప్రధాని తనకు భరోసా ఇచ్చినందున తెలంగాణలో నియోజకవర్గాలపై దృష్టి సారించి, పార్టీని పటిష్టం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఏడాదికి ముందే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలున్నాయని, ఈలోగా నియోజకవర్గాల్లో పర్యటించి సమర్థులైన నేతలను గుర్తించి, పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కాగా తెలంగాణలో బిజెపి నేతల వ్యవహారశైలి పొత్తుకు భంగం కలిగేలా ఉందని, వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండదని చేస్తున్న బహిరంగ ప్రకటనల వల్ల పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉందని ఆ ప్రాంత నాయకులు బాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని, ఏ పార్టీ అయినా తాను సొంతంగా బలపడాలని కోరుకుంటుందని, ఈ విషయంపై తాను బిజెపి నాయకత్వంతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ‘తెలంగాణలో పార్టీ క్యాడర్ ఇంకా మనతోనే ఉంది. పార్టీ బలోపేతానికి మీరేం చేయాలో చేయండి. సమష్టిగా నిర్ణయాలు తీసుకోండి. దూకుడుగానే వెళ్లండి. ప్రజల్లో ఆలోచన మొదలయింది. మీరు నిరంతరం ప్రజల్లోనే ఉండండి. మళ్లీ హైదరాబాద్‌పై దృష్టి సారించండి. మీకేం కావాలన్నా నేనున్నా’ అని స్పష్టం చేశారు.
కాగా విశాఖలో జరిగే మహానాడుకు ముందు వచ్చే నెల 24న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే మహానాడు ప్రతినిధుల సభకు హాజరుకావాలని పార్టీ నాయకులు బాబును కోరారు. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపి గరికపాటి మోహన్‌రావు, పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవిందకుమార్‌గౌడ్, ఉమామాధవరెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.