తెలంగాణ

అన్ని రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు బాగుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్ కుమార్ చెప్పారు. గోదాముల నుండి రేషన్ షాపులకు సరుకులు చేరే వరకు జరిగే ప్రతి కదలికను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేయడం సరైనదని అన్నారు. ఒక రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన దీపక్ కుమార్ మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు పరిశీలించారు.
మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, సరుకులు తరలించే లారీలకు జిపిస్ వాడకంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానం బాగుందని, దీన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సిఫారసు చేయనున్నట్టు చెప్పారు. ప్రతి అడుగూ నిఘా నీడన సాగేట్టుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం తరలింపును ఈ సెంటర్ ఏర్పాటు తర్వాత నిరోధించగలిగినట్టు చెప్పారు. రేషన్ సరుకులు మార్గమధ్యలో దారి మళ్లించకుండా వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని, 1388 వాహనాలకు జిపిఎస్ అమర్చినట్టు చెప్పారు. ఈ పాస్ విధానంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ వెనకబడి ఉందని దీపక్ కుమార్ చెప్పారు. నగదు రహిత లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్ మిషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పాస్ విధానం అమలులో కేంద్రం గట్టిగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును మరింత వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా ఈ పాస్ విధానం అమలు చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేస్తున్నట్టు ఆనంద్ తెలిపారు. గత ఖరీఫ్‌లో దాదాపు నాలుగు లక్షల మంది రైతుల నుండి 16.45 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, ఆన్‌లైన్ ద్వారా 2500 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేసినట్టు ఆనంద్ తెలిపారు.