తెలంగాణ

ఇదీ మా బలం.. మా బలగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ‘ఇంత భారీ బహిరంగ సభ అంటే దేశంలో ఏ పార్టీకైనా గుండెలు జారిపోతాయి’వరంగల్ టిఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలివి, దేశంలో పార్టీల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో విపక్షాలు గుండెలు జారిపోయే విధంగా బహిరంగ సభ నిర్వహించాలనుకున్న టిఆర్‌ఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందనే చెప్పాలి. విపక్షాలకు తమ బలమేంటో కెసిఆర్ చూపించారు. వరంగల్ రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయే విధంగా, మంత్రులు సైతం బహిరంగ సభ వేదికకు చేరుకోలేని విధంగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. ప్రగతి నివేదిక పేరుతో వరంగల్‌లో టిఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ముఖ్యమంత్రి ప్రసంగానికి ప్రాధాన్యత ఇవ్వడం కన్నా భారీ ఎత్తున జన సమీకరణ జరపడం ద్వారా టిఆర్‌ఎస్ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించాలనుకున్నట్టు ముఖ్యమంత్రి ప్రసంగ తీరు గమనిస్తే అర్థం అవుతుంది. ఉరుములు లేవు, పిడుగులు లేవు, ప్రత్యర్థులపై మాటల దాడులు లేవు, మేం సాధించింది ఇది, సాధించబోయేది ఇది అని చెప్పడానికే పరిమితం అయినా 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో మాకు ఎవరూ దరిదాపుల్లో లేరు అని చూపించాలని అనుకున్నారు, చూపించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో భారీ బహిరంగ సభలు, ఉద్వేగ పూరిత వాతావరణంలో చురుక్కుమనే మాటల బాణాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన సభలు అనేకం జరిగాయి. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత భారీ బహిరంగ సభ ఇదే. దాదాపు పదిహేను లక్షల మందిని సమీకరించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను అనుకున్న విధంగా నిర్వహించారు. గ్రామాలకు గ్రామాలు ఇళ్లకు తాళాలు వేసి వరంగల్ సభకు బయలు దేరడంతో పల్లె సీమల్లో టిఆర్‌ఎస్ పట్టు, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ బలం బలగం ఎంతో తెలిసి వచ్చింది. మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, జగదీశ్‌రెడ్డిలు గంటల తరబడి జనగాంలోనే ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. సభ ప్రారంభం అయ్యాక ఎలాగోలా వరంగల్ చేరుకున్నారు. 31 జిల్లాల నుంచి జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. మంత్రులంతా తమ తమ జిల్లాల నుంచి ట్రాక్టర్లలో వరంగల్‌కు చేరుకున్నారు. దాదాపు పదివేల ట్రాక్టర్లలో తరలి వచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికలకు దాదాపు 107 ఎన్నికల సభల్లో కెసిఆర్ ప్రసంగించారు. అవన్నీ ఎక్కడికక్కడ నియోజక వర్గం స్థాయి సభలే. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన రెండు ప్లీనరీల్లోనూ సికిందరాబాద్, ఎల్‌బి స్టేడియంలలో చిన్న సభలే నిర్వహించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్న సమయంలో ప్రత్యర్థులపై మానసికంగా విజయం సాధించే విధంగా బహిరంగ సభ జరిపారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ద్వారా ప్రజల్లో టిఆర్‌ఎస్ పట్టు ఎంతో తెలిసి వచ్చింది. ఎన్నికల విజయాలు సరే ఇది సరిపోదు వచ్చే ఎన్నికల నాటికి విపక్షాలను మానసికంగా బలహీన పరచాలి అంటే మన బలం, బలగం ఎంతో ఓసారి చూపించాలి అనుకున్న కెసిఆర్ వ్యూహాత్మకంగా విజయం సాధించారు. ఉద్యమ కాలంలో భారీ బహిరంగ సభ నిర్వహించినా టిఆర్‌ఎస్ చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభగా నిలిచిపోయేట్టు వరంగల్ సభ నిర్వహించారు. వారం రోజుల పాటు గులాబీ కూలి నిర్వహించడం ద్వారా బహిరంగ సభకు పార్టీ శ్రేణులను, ప్రజలను సిద్ధం చేశారు. మంత్రులు, నాయకులు తమ తమ నియోజక వర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ జరిపి విజయం సాధించారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయని అందుకే భారీ బహిరంగ సభ అని విపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ కెసిఆర్ మాత్రం 2019లోనే ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి, ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెర వేశారు. 2019లో మనమే గెలుస్తాం అని సకాలంలోనే ఎన్నికలు వస్తాయని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులపై రాజీలేని పోరాటం సాగిస్తానని అన్నారు.
భారీ బహిరంగ సభ అయినా కెసిఆర్ అరగంటకు మించి మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశామో, ఇప్పుడు ఏం చేయబోతున్నామో చెప్పారు. రైతులపైనే ప్రధానంగా దృష్టిసాగించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కోర్టు కేసుల ద్వారా కాంగ్రెస్ ఎలా అడ్డంకులు కల్పిస్తున్నది కెసిఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.