తెలంగాణ

సాహితీ పోటీల్లో ఎప్పుడూ నేనే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 28: చదువుకునే రోజుల్లో తాను తెలుగు సాహిత్యంలో జరిగే అన్ని పోటీలలో ఫస్ట్ వచ్చేవాడిని, ఎక్కువ మార్కు లు, బహుమతులు తనకే వచ్చేవని, దీంతో అధ్యాపకుల వద్ద సహచర విద్యార్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసేవారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. జనగామ జిల్లాలో శుక్రవారం ఆయన బమ్మెర గ్రామాన్ని సందర్శించి, మహాకవి బమ్మెర పోతన సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ, తాను చదువుకునే రోజుల్లో తెలుగు సాహిత్యంపై మంచి పట్టు ఉన్న పరాశరం గోపాలకృష్టమూర్తి ఆధ్వర్యంలో సిద్ధిపేటలోని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన సాహితీ పోటీల్లో ఎప్పుడూ తానే ప్రథముడిగా నిలిచేవాడినని, ఇదిచూసి తన సహచరులు ఎదో మతలబు జరుగుతున్నట్లు ఫిర్యాదులు చేసేవారని చెప్పారు. దాంతో ఒకరోజు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించారని, కానీ ఆ రోజు న పోటీల గురించి మర్చిపోయన తనకు మరో అరగంటలో పోటీ ముగుస్తుందనగా ఆ విషయం గుర్తుకు వచ్చిందని, దీంతో పరుగు పరుగున కళాశాలకు వెళ్లి పోటీలో పాల్గొన్నానని, చివరకు పెన్ను కూడా మరచిపోతే వేరే వ్యక్తి దగ్గర పెన్ను తీసుకుని పోటీలో పాల్గొన్నానని తెలిపారు. ఆ రోజు ఏ అంశంపై వ్యాసం రాయాలని ఆలోచిస్తున్న తనకు అంతకు కొన్ని రోజుల ముందు చది విన డాక్టర్ సి.నారాయణరెడ్డి పుస్తకం ‘మం దార మకరందం’ గుర్తొచ్చిందని, దానిని మననం చేసుకుని వ్యాసం రాస్తే మళ్లీ ప్రథమ బహుమతి తనకే లభించిందని కెసిఆర్ తెలిపారు. దీనిపై మళ్లీ అభ్యంతరం వ్యక్తమ వడంతో ప్రిన్సిపాల్ గంగిరెడ్డి పర్యవేక్షణలో పోటీ నిర్వహించగా, బమ్మెర పోతనపై వ్యాసం రాసినందుకు మళ్లీ ప్రథమ బహుమ తి లభించిందని సిఎం చెప్పారు. అనంతరం ఆయన పోతన రచించిన కొన్ని కవితలను చదవి చప్పట్లతో సభికుల అభినందనలు అందుకున్నారు.