తెలంగాణ

ప్రగతి నివేదన పేరుతో మాపై దూషణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: వరంగల్‌లో తెరాస నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తిట్టిపోస్తావా? అంటూ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. గత రెండున్నర ఏళ్లలో తెరాస సర్కారు సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, వాటి అమలు వంటి అంశాలపై మాట్లాడాల్సిన సిఎం కెసిఆర్ విచక్షణ మరచి కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అంటూ సంస్కార హీనంగా మాట్లాడారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్ తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను తిట్టడంపై దృష్టిసారించిన కెసిఆర్ వరంగల్ సభ అసలు ఉద్దేశ్యాన్ని పక్కకు పెట్టారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, తమ పార్టీ నేతలను కెసిఆర్ తిట్టిన తర్వాత తాము ప్రత్యేక అసెంబ్లీకి వెళ్లాలా?, అధికార పార్టీకి ఇష్టం వచ్చినట్లు అసెంబ్లీని నడుపుతుంటే తాము వెళ్లడం అవసరమా? అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బాహుబలి సినిమా క్రేజ్‌తో దోపిడీ జరుగుతుందని, దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆయనొక్కరే తెలంగాణ సాధించారా..?
తెలంగాణ రాష్ట్రాన్ని తానే సాధించినట్లు సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ సభలో సిఎం ప్రసంగించిన తీరును తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎంపిల పోరాటంతో సోనియా గాంధీ పట్టుబట్టి తెలంగాణ ఇచ్చిన విషయం ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరానికి ఐదున్నర లక్షల రూపాయల ఖర్చు అవుతోందని, కేవలం వర్షాకాలంలో ఒక పంట కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఆయన కెసిఆర్ సర్కారును ప్రశ్నించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య మాట్లాడుతూ, వరంగల్‌లో తెరాస నిర్వహించిన సభను ప్రగతి నివేదన సభ అనడం కంటే అధికార ఆరాట సభ అంటే బాగుంటుందన్నారు.