తెలంగాణ

మెట్రోయేతర నగరాల్లోనే మలేరియా వ్యాప్తి అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశ వ్యాప్తంగా మలేరియా వ్యాధి మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో 85 శాతం ఉంటే, మెట్రో నగరాల్లో 15 శాతం మాత్రమే మలేరియా వ్యాధి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన అధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా పట్ల ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించినట్లు ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికంగా 32 శాతం, గుజరాత్ 19 శాతం, మహారాష్ట్ర 13 శాతం మలేరియా కేసులు నమోదైనట్లు పేర్కొంది. మలేరియా సోకుతున్న వారిలో 21 నుంచి 40 ఏళ్లవారు ఎక్కువగా ఉంటున్నారని, దీనిలో పురుషులు 69 శాతం, మహిళలు 31 శాతం మంది ఉన్నట్లు ఎస్‌బిఐ తన నివేదికలో వెల్లడించింది. నివాసలకు సమీపంలో నీరు నిల్వ ఉండిపోవడం, దానిపై మలేరియా వ్యాధి విస్తరింప చేసే అనోఫిల్స్ దోమలు పెరగడం వల్ల సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమలను నివారించవచ్చని సూచించింది. ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతినిధి మిక్ మిల్లర్ తెలిపిన సమాచారం మేరకు ఆ ప్రకటనలో కొన్ని వివరాలను ఎస్‌బిఐ పేర్కొంద. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద గత ఏడాది నమోదైన లెక్కలను బట్టి భారత దేశంలో 10,59,437 కేసులు నమోదు కాగా, 242 మంది మలేరియా వ్యాధి వల్ల చనిపోయారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా పట్ల చైతన్యం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు మిల్లర్ వెల్లడించారు.