ఆంధ్రప్రదేశ్‌

మూడు నెలల్లో సెక్యూరిటీ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: సుప్రీం కోర్టు పోలీసు సంస్కరణలపై జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తక్షణమే రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్, పోలీసు కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే మూడు నెలల్లో ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులు తమను స్టేషన్‌కు రావాలన్న ఆదేశాలతో అసభ్యంగా దూషిస్తున్నారని, శారీరంగా వేధింపులకు గురి చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. తమను వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈమేరకు సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్, పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటు చేయాలని, వీటిల్లో రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథధారిటీ మెంబర్ కార్యదర్శిని సభ్యుడిగా నియమించాలని కోరారు. జిల్లా స్ధాయిలో పోలీసు కంప్లైంట్స్ అథారిటీ సెల్స్‌ను ఏర్పాటు చేయాలని, వీటిల్లో జిల్లా లీగల్ సర్వీసస్ అథారిటీ కార్యదర్శిని సభ్యుడిగా నియమించాలన్నారు. సుప్రీం కోర్టు పోలీసు సంస్కరణలపై మార్గదర్శకాలు జారీ చేసి పదేళ్లు గడచిందన్నారు. ప్రజలు పోలీసులపై ఇచ్చే ఫిర్యాదులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ అథారిటీని ఏర్పాటు చేసిన వెంటనే తమ వద్ద దాఖలైన పిటిషన్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. కంప్లైంట్స్ అథారిటీ, సెక్యూరిటీ కమిషన్‌ల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.