తెలంగాణ

కేసులు వీగిపోతాయనేది కాంగ్రెస్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 38 కేసులు వేసిందని, శాసన మండలి, శాసన సభలో ఆదివారం ఆమోదించిన బిల్లు వల్ల కేసులు వీగిపోతాయనేది కాంగ్రెస్ భయం అని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శాసన సభలో, మండలిలో బిల్లు ఆమోదం పొందిన తరువాత హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్టప్రతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేసులు రద్దవుతాయనేది కాంగ్రెస్ భయమని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం, కానీ ప్రాజెక్టులు తొందరగా పూర్తి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని అన్నారు. భూములు కోల్పోయిన వారికి తాజా చట్టం ద్వారా మంచి పరిహారం అందుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తుల కోసం ఆరాటపడి భూ సేకరణ జరిపారని, తాము రాష్ట్రం కోసం, రైతుల కోసం భూ సేకరణ చేస్తున్నామని అన్నారు. పోలేపల్లి సెజ్‌లో ఎకరానికి 60వేల రూపాయల పరిహారం మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. బిజెపి నేతలు ఇక్కడ ధర్నాలు చేయడం కన్నా, కేంద్రంతో పోరాడి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల వంటి వాటి గురించి కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నామని అన్నారు. దత్తాత్రేయ నిజామాబాద్‌లో మాట్లాడటం కాదు ఢిల్లీలో మాట్లాడాలని సూచించారు. ముదిగొండలో తొమ్మిది మంది రైతులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పాలనలోనే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో ఆరుగంటల పాటే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంతో ఐదు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిందని, రైతులకు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్టు చెప్పారు. రైతులు ముఖాలకు ముసుగు కప్పుకొని దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో రాజకీయ కక్షతో జరిగిన దాడి అని విమర్శించారు. వరంగల్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్, టిడిపిల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్టు ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో కన్నా మన రాష్ట్రంలోనే మిర్చికి ఎక్కువ ధర వస్తోందని, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా మిర్చిని అమ్ముకునేందుకు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు.