తెలంగాణ

ప్రపంచ దేశాలకు ఆదర్శం ములకనూరు సహకార బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఏప్రిల్ 30: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ములకనూరు సహకార బ్యాంకు రైతులకు సేవలందించడంలో ప్రపంచ దేశాలు ఆదర్శం అని ఎఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులోని సహకార గ్రామీణ బ్యాంకును ఆయన ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత అలిగిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బ్యాంకులో రైతులకు అందిస్తున్న సేవల గురించి బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు.