తెలంగాణ

మా హక్కుల పరిరక్షణకు ధర్నా చౌక్ పునరుద్దరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తమ హక్కుల పరిరక్షణ, సమస్యల సాధనకు ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలబాలికలు నిరసన దీక్ష నిర్వహించారు. సోమవారం మగ్ధుంభవన్‌లో నిర్వహించిన దీక్ష శిబిరంలో పలువురు బాలబాలికలు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వెంటనే ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 10 నుంచి పిజి వరకు చదువుతున్న బాలబాలికలు ఈ ధర్నా నిర్వహించారు. హోప్ ట్రస్ట్, అమన్ వేదిక, మా ఇళ్లు ప్రజాదరణ వంటి స్వచ్ఛంద సంస్థలకు చెందిన బాల బాలికలు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకునేందుకు ఒక వేదిక అంటూ లేకుండా చేయడంపై కొందరు బాలలు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి రమేష్ ఈ ధర్నాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఈ దీక్షలు నిర్వహించడం వారిలో చైతన్యానికి నిదర్శనమని అన్నారు. ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ తరఫున పలువురు ఈ దీక్షలో పాల్గొన్నారు.