తెలంగాణ

టూరిజం ప్రచారానికి విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ ప్రాంత పర్యాటక ప్రదేశాల చిత్రాలతో అలకరించిన విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి స్పైస్ జెట్ విమాన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రెండు నెలల పాటు స్పైస్ జెట్ విమానం దేశంలోని ప్రధాన నగరాలతో పాటు థాయ్ లాండ్, దుబాయి, శ్రీలంక, మస్కట్, ఇండోనేషియా తదితర దేశాలలో విహరించనుంది. తద్వారా పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభించనుందని మంత్రి ఆజ్మీరా చందూలాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొని బ్రాండింగ్ స్సైస్ జెట్ విమానం వల్ల కలుగనున్న ప్రచారాన్ని వివరించారు.

చిత్రం..తెలంగాణ పర్యాటక ప్రదేశాల చిత్రాలతో అలంకరించిన విమానాన్ని
మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభించిన మంత్రి చందూలాల్