రాష్ట్రీయం

31న ప్రాజెక్టులపై సిఎం ప్రజెంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: నీటి పారుదల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 31న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ఇవ్వనున్నారు. ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రస్తావన తెచ్చారు. అందుకు విపక్షాల సభ్యులు అభ్యంతరం లేవదీశారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడం, దానికి ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడం జరుగుతుందే తప్ప, సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మంచిది కాదని అన్నారు. భవిష్యత్తులో ఇదొక ఆచారం, సంప్రదాయంగా మారుతుందని వారు తెలిపారు. అసెంబ్లీ రూల్స్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి రూల్ లేదని, ఇప్పుడు ఏ రూల్ కింద దీనిని చేపడతారని వారు ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోగానీ, దేశంలోగానీ ఎక్కడైనా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిందా? అని ప్రశ్నించగా, తమకు తెలిసినంత వరకు జరగలేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రోజు, రోజుకూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నదని, సభలోకి ల్యాప్‌టాప్‌లు, ప్యాడ్‌లు సభ్యులు తీసుకుని వచ్చి ఉపయోగిస్తున్నారని ఆయన ఉదహరించారు. కాబట్టి ఇప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త పంథాలో వెళితే తప్పేమిటని అన్నారు. మన రాష్ట్రం దీనికి శ్రీకారం చుట్టి దేశంలోని చట్ట సభలకు ఆదర్శంగా నిలబడితే మంచిదే కదా? అని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి అంత పట్టుదల ఎందుకని సభ్యులు ప్రశ్నించారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీ హాలులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని, దానికి ఎమ్మెల్యేలనే కాకుండా, ఎమ్మెల్సీలనూ ఆహ్వానించాలని సూచించారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూలంకషంగా చర్చించవచ్చని, సభ్యుల అనుమానాలకు, సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానాలు చెబితే బాగుంటుందని సూచించారు. డాక్టర్ లక్ష్మణ్ చేసిన సూచన పట్ల పాలక పక్షం మినహా ప్రతిపక్ష సభ్యులు సానుకూలంగా స్పందించారు. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో అన్ని పార్టీల సభ్యులు స్పీకర్ నిర్ణయానికే వదిలి వేశారు.
30న కరవుపై చర్చ
ఇలాఉండగా ఇంకా మిగిలి ఉన్న పద్దుల (డిమండ్ల)పై 28న చర్చించి ఆమోదించాలని, 29న ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపాలని, 30న కరవుపై, విద్యపై చర్చించాలని బిఎసి నిర్ణయించింది. 31న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిఎం కెసిఆర్ ఇచ్చే అంశంపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.