తెలంగాణ

మిషన్ భగీరథపై యునిసెఫ్ అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందించే పథకంపై యునిసెఫ్ త్వరలోనే అధ్యయనం చేయనుంది. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తారు. యూనిసెఫ్ అధ్యయనం కోసం సర్వేయర్లకు సెస్ కార్యాలయంలో మంగళవారం రాష్టస్థ్రాయి శిక్షణ నిర్వహించారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన 200 మందికి సెస్‌లో ఎనిమిది రోజుల శిక్షణ ఇస్తారు. తెలంగాణ మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ అని భావించిన ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి సురేందర్‌రెడ్డి తెలిపారు.
మిషన్ భగీరథను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ మోడల్‌గా భావిస్తున్నారన్నారు. పదివేల గ్రామాలకు తాగునీటిని అందించే గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్లానింగ్, డిజైనింగ్‌కు మూడేళ్లు పడితే, పథకం పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందని తెలిపారు. కానీ తెలంగాణలో 24248 అవాసాలకు సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథను కేవలం మూడేళ్లలో పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తవుందని తెలిపారు. మిషన్ భగీరథ డిజైన్, అంచనాలను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లే రూపొందించి 200 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేశారని చెప్పారు. భగీరథ పైప్‌లైన్లతో పాటే డక్ట్ వేయడంతో మరో వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనం మిగిలిందని అన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథపై చర్చ జరగుతోందని, వివిధ రాష్ట్రాల అధికారులు వచ్చి చూస్తున్నారని చెప్పారు.
సెస్ డైరెక్టర్ ఎస్ గాలబ్ మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలతో కలిసి పని చేసిన తాము కోట్లాది మంది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపించే మిషన్ భగీరథలో తాను భాగం అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తాగునీటి సంబంధం సమావేశాల్లో మిషన్ భగీరథను ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపిస్తుందని అన్నారు.

వైద్యంపై పరిశోధనలు జరగాలి

అడుగంటిపోతున్న ప్రజారోగ్యం
సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా

హైదరాబాద్, మే 9: దేశంలో ప్రజారోగ్యం అడుగంటుతోందని, నూతన వైద్య విధానాలపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉందని, యువ వైద్యులు ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల శిక్షణా శిక్షణ కార్యక్రమాన్ని సిసిఎంబి మంగళవారం నిర్వహించింది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను అందించడంలో ఈ శిక్షణ కార్యక్రమం సహాయ కారి అవుతుందని అన్నారు. ప్రస్తుత వైద్య పాఠ్యప్రణాళికలో అంతరాన్ని భర్తీ చేసేందుకు, ఔత్సాహిక క్లినిషియన్లకు ప్రాథమిక పరిశోధనా పద్ధతులను గురించి అవగాహన కలిగించేందుకు, ఆయా పద్ధతులను క్లినికల్ సమస్యలకు ఎలా వర్తింపచేయవచ్చో తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. బయోఇన్ఫర్మేటిక్స్, డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ ఆధారిత టెక్నిక్‌లు, సెల్ బయాలజీ, మాంసకృతులు, వ్యాధి నిరోధక చికిత్సా విధానం మెలకువలు, ఐదు పరిశోధనా విభాగాలపై ఈ శిక్షణ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని మిశ్రా తెలిపారు. సిసిఎంబి వద్ద ఉన్న అత్యాధునిక వౌలిక వసతి సదుపాయాలు, మోడరన్ బయాలజీలో సిసిఎంబికి ఉన్న ప్రావీణ్యం ఈ శిక్షణ కార్యక్రమానికి తళుకులు అద్దనుంది. ఈ సందర్భంగా నిపుణులు ఉపన్యాసాలతో పాటు వేర్వేరు పరిశోధనా రీతులపై అభ్యాసంతో కూడిన శిక్షణ కూడా అందిస్తారు. సిసిఎంబి నిర్వహిస్తున్న విద్యాసంబంధ, నైపుణ్య వికాస సంబంధ కార్యకలాపాలకు ఒక కీలకమైన జోడింపే ‘మెడ్-ఎస్‌ఆర్‌టి’ అని పేర్కొన్నారు. అత్యాధునిక పరిశోధన పద్ధతులపై ఏర్పడే అవగాహన వైద్యవిద్యార్ధులు క్లినికల్ రీసెర్చి స్కాలర్ వృత్తిని ఎంచుకునేందుకు వారిలో ఉత్తేజాన్ని రగల్చుతుందని మిశ్రా వివరించారు.