తెలంగాణ

15 రోజుల్లో గ్రౌండింగ్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: మరో పదిహేను రోజుల్లో మిషన్ కాకతీయ మూడో దశ పనుల గ్రౌండింగ్ 90శాతం పూర్తి కావాలని నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయపై అధికారులతో మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. మిషన్ కాకతీయ 1,2దశలలో ఇంకా పూర్తి కాని పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. కాకతీయ ఒకటో దశ పనుల్లో ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు అవసరమైతే వాటిని వెంటనే చేపట్టాలన్నారు. కాకతీయ మూడోదశ గ్రౌండింగ్‌లో ఆదిలాబాద్ మొదటి స్థానంలో ఉందని జిల్లా అధికారులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
కాకతీయ 1,2లో మాదిరిగానే 3లో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా హాజరు కాకపోయినా వెంటనే పనులు ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఇఎన్‌సి మురళీధర్‌రావు, భగవంతరావు, శ్యామసుందర్, మధుసూదనరావు, లింగరాజు, శ్యాం సుందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం సచివాలయంనుంచి మిషన్‌కాకతీయ పనులపై వీడియో కాన్ఫరెన్స్‌లో
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు