బిజినెస్

టిఎస్ ఐపాస్‌తో పరిశ్రమల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రాయతీలు
పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

నల్లగొండ, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టిన టిఎస్‌ఐ పాస్ విధానంతో నల్లగొండ జిల్లాలో పారిశ్రామిక పురోగమనం శరవేగంగా సాగుతోంది. సింగిల్ విండో విధానంతో నిర్ధిష్ట గడువులోగా పారిశ్రామికులకు అనుమతులిస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వందల సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల స్థాపనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సాగిస్తూ అనుమతులు పొందుతున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు నూతనంగా ప్రభుత్వం తెచ్చిన టిఎస్ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలు వికలాంగులకు పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుండడం గమనార్హం. టిఎస్ ప్రైడ్ విధానంలో పురుషులకు 35 శాతం, మహిళలకు 45 శాతం రిజర్వేషన్‌తో 75 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. టిఎస్ ఐడియా విధానంలో బిసి, జనరల్ కోటా పారిశ్రామికవేత్తలకు మహిళలకు 50 శాతం, మహిళలకు 20 శాతం రిజర్వేషన్ అనుసరించి 25 లక్షల రాయితీ ఇవ్వనున్నారు. టిఎస్ ఐడియా విధానంలో నల్లగొండ జిల్లాలో టిఎస్ ఐ పాస్ కింద 118 పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 248 అనుమతులు అవసరమవ్వగా 220 అనుమతులు ఇవ్వగా 24 పెండింగ్‌లో ఉండగా ఎనిమిదింటిని తిరస్కరించారు. కొత్త పరిశ్రమల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లుగా దరఖాస్తుల వివరాల ద్వారా వెల్లడవుతోంది. తాజాగా అనుమతుల కోసం అందిన ఐదు పరిశ్రమల ద్వారానే 255 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో పెద్దకాపర్తిలో పద్మ ఫుడ్ ప్రాసెసింగ్ లిమిటెడ్, ఆత్మకూర్(ఎస్) కందగట్లలో కీర్తి ఎస్టెట్స్ ప్రైవేటు లిమిటెడ్ సొలార్ పవర్ ప్లాంట్, చింతలపాలెంలో అంజని ఫోర్ట్ ల్యాండ్ సిమెంట్, మేళ్లచెర్వు మైహోం సిమెంట్, వెలిమినేడు విఎస్‌కే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. పరిశ్రమల స్థాపన కోసం జిల్లాలో 5 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ సైతం సిద్ధం చేసి అనుమతుల జారీలో జిల్లా యంత్రాంగం వేగంగా స్పందిస్తుండగా పరిశ్రమల స్థాపన యత్నాలు వడివడిగా ముందడుగు వేస్తున్నాయి.