తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నందిని సిధారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు కావాలని తాను కలలు కన్నానని, తన కలలు నిజమయ్యాయని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాహిత్య అకాడమి సజావుగా నడిచేందుకు కవులు, రచయితలు సహకరించాలని, కొత్త తరం కవులు, రచయితలను ప్రోత్సహిస్తానని సిధారెడ్డి తెలిపారు. చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సాంస్కృతిక టూరిజం కార్యదర్శి బి.వెంకటేశం, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్‌వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.