తెలంగాణ

వర్శిటీల్లో 1061 పోస్టులు త్వరలో భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 1061 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్శిటీల అభివృద్ధికి 420 కోట్లు కేటాయించామని, వాటితో విద్యార్థులు, సిబ్బందికి వసతులు, ల్యాబ్‌లు నిర్మిస్తామని, మరమ్మతుల కోసం ఆ నిధులను వినియోగించిన తర్వాత మిగిలితే కొత్త భవనాలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సిబ్బంది శిక్షణ అభివృద్ధి కేంద్ర భవనాన్ని కడియం శ్రీహరి బుధవారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఎదగాలని సూచించారు. మధ్యలో చదువు మానేసిన వారికి ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో పనిచేయాలని అన్నారు. సంప్రదాయ కోర్సులకు భిన్నమైన కోర్సులను అందించాలని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా జాబ్‌లు వచ్చే కోర్సులను రూపొందించాలని , వ్యవసాయం, ఆరోగ్యం, పశు సంవర్థన రంగాలపై తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినందున ఆ రంగాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులను ప్రారంభించాలని చెప్పారు.
దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోనే ఏర్పాటైందని, ఈ విధానం విజయవంతం కావడంతో దేశంలోని అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. గతంలో విశ్వవిద్యాలయాల పటిష్ఠతకు ఎన్నడూ 420 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు వల్ల విశ్వవిద్యాలయాలు పటిష్ఠమవుతాయని పేర్కొన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి 20 కోట్లు ఇచ్చామని పేర్కొనగా, విసి ప్రొఫెసర్ కె సీతారామారావు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నత విద్యలో 30 శాతం నేడు ఓపెన్ వర్శిటీల భాగస్వామ్యం ఉందని విసి చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి వెంకయ్య, డైరెక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.