తెలంగాణ

సెట్ ఉత్తీర్ణత మరింత కఠినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నియమితులయ్యేందుకు అర్హతగా నిర్ధారించే రాష్టస్థ్రాయి అర్హత పరీక్ష (సెట్) ఈ ఏడాది విద్యార్థులకు శాపంగా మారనుంది. గతంలో విరివిగా అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన ‘సెట్’లో ఈ ఏడాది నుండి కొత్తగా అమలులోకి వస్తున్న నిబంధనలతో అర్హత సాధించడం కష్టసాధ్యమే. ఇప్పటికే జాతీయ అర్హత పరీక్ష (నెట్)లో అమలుచేస్తున్న నిబంధనలను రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలో కూడా అమలుచేసేందుకు ప్రభుత్వం, అర్హత పరీక్ష కమిటీ నిర్ణయించాయి. వాస్తవానికి జాతీయ అర్హత పరీక్షను అనుసరించే ఉత్తీర్ణత ప్రమాణాలపై కేరళ రాష్ట్రానికి చెందిన నాయర్ సేవా సంస్థ ఎర్నాకులంలోని కేరళ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ (5190) దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం నిరుడు డిసెంబర్ 16న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జాతీయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత ప్రమాణాలను యుజిసి మార్చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించి ఫలితాల ప్రకటనకు అనుసరించే ప్రమాణాలు, పద్ధతులు దీంతో మారిపోయాయి. విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం నిర్ణయం ప్రకారం జాతీయ అర్హత పరీక్షను రాసిన మొత్తం అభ్యర్థుల్లో 6 శాతం మందిని మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు ఉత్తీర్ణులను చేస్తున్నారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు సంబంధించి జాతీయ అర్హత పరీక్షలోని మూడు పేపర్లను తప్పనిసరి రాసి కనీసం 40 శాతం మార్కులను సమిష్టిగా పొందాల్సి ఉంటుంది. ఇక రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులు మూడు పేపర్లలో కనీసం 35 శాతం మార్కులను సమిష్టిగా పొందాలి.
ఊహాత్మకంగా తీసుకుంటే యుజిసి అర్హత పరీక్షకు ఆరు లక్షల మంది హాజరైతే అందులో ఆరు శాతం మంది అభ్యర్థులను మాత్రమే అంటే 36వేల మందిని మాత్రమే అర్హులను చేస్తారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న రిజర్వేషన్ల ప్రకారం కనీసం 27 శాతం క్రీమిలేయర్ పరిధిలోకి రాని ఓబిసి అభ్యర్థులను, 15 శాతం షెడ్యూల్డు కులాల అభ్యర్థులను, 7.5 శాతం షెడ్యూల్డు తెగల అభ్యర్థులను, మూడు శాతం ఆసక్తులు (పిడబ్ల్యుడి) అభ్యర్థులను ఉత్తీర్ణతకు కేటాయించడం జరుగుతుంది. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే క్రీమిలేయర్ పరిధిలోకి రాని ఓబిసిలు 27 శాతం అంటే 9720, ఎస్సీలు 15 శాతం అంటే 5400, ఎస్టీలు 7.5 శాతం అంటే 2700, ఆసక్తులు (పిడబ్ల్యుడి) 1080 మంది, జనరల్ 47.5 శాతం అంటే 17100 అర్హులుగా గుర్తిస్తారు. మొత్తం చూస్తే 36వేలు ఉంటారు. ప్రతి సబ్జెక్టులోని మూడు పేపర్లలో వారి కేటగిరికి సంబంధించి కనీస మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య ఆ కేటగిరికి చెందిన మొత్తం అభ్యర్థుల విశే్లషణలను చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువ తక్కువ ఉండటం లేదా కనీస సగటు మార్కులు సమానంగా రావడం వంటి సందర్భాల్లో నిష్పత్తి సంఖ్య 1 కంటే తక్కువ ఉంటే దానిని ఒకటిగానే భావిస్తారు. దశాంశాల స్థానాలు ఉంటే సమీప పూర్ణ సంఖ్యను సరిచేస్తారు. మూడు పేపర్లలో పొందిన సమిష్టి మార్కుల అర్హత స్థాయి శాతాన్ని నిర్ణయించి ఒక్కో సబ్జెక్టులో ఉత్తీర్ణత ఫలితాలను ప్రకటిస్తారు. రాబోయే అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రకటనల్లో కూడా ఇంతకు ముందరి ఉత్తీర్ణత ప్రమాణాల స్థానే కొత్త విధానాలను పొందుపరచనున్నట్టు తెలిసింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని యుజిసి మార్గదర్శకాలను పాటించడమేనని తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ పి యాదగిరి స్వామి పేర్కొన్నారు.