తెలంగాణ

రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపికే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికే ఓటు వేయాలని టిఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. బిజెపికి ప్రస్తుత బలానికి తోడు రోజు రోజుకు కొత్త మిత్రుల బలం తోడవుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు సైతం మద్దతు ఇస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వనున్నట్టు కెసిఆర్ వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైకాపా రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు. టిడిపి బిజెపిలు కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తున్నప్పుడు తెలంగాణలో ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ బిజెపికి మద్దతు ఇవ్వడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ ఉండవని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎంఐఎం మా మిత్రపక్షం అని ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సార్లు శాసన సభలో ప్రకటించారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత మంత్రివర్గంలో చేరాలని కోరుతూ ఎంఐఎం ప్రధాన కార్యాలయానికి కెసిఆర్ పార్టీ ముఖ్యులను పంపించారు. ఒకవైపు ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు బిజెపికి చేరువ అయ్యారు. వివిధ సందర్భాల్లో కేంద్రంలో బిజెపికి టిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చినప్పుడు బిజెపి ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ చేరబోతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఉమ్మడి రాజధాని, ఇంకా పరిష్కారం కాని పలు సమస్యలు, సెక్షన్ 8 వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రభుత్వంతో టిఆర్‌ఎస్ స్నేహ పూర్వక ధోరణితోనే ఉంటోంది.
తెలంగాణలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉంటుందని, కొత్త పార్టీలు, టిడిపి, బిజెపిలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే చీల్చగలుగుతాయని, పరోక్షంగా ఇది టిఆర్‌ఎస్‌కు ప్రయోజనం అనే అంచనాలో టిఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. కేంద్రంతో ఘర్షణ పడే పరిస్థితి లేదని అదీ కాకుండా రాష్ట్రంలో బిజెపికి పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి కేంద్రంలో బిజెపితో సన్నిహితంగా మెదలడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ ఉండదనే భావనతో టిఆర్‌ఎస్ ఉంది. మిత్రపక్షంగా ఉన్న పాలకుల కన్నా ఎన్‌డిఏలో భాగస్వామిగా లేని కెసిఆర్‌కే మోదీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకత్వం చెబుతోంది.
కేంద్రంతో సన్నిహితంగా ఉండడమే రాష్ట్రానికి ప్రయోజనం అనే భావనతో అవసరం అయిన ప్రతి సందర్భంలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి టిఆర్‌ఎస్ మద్దతు ఇస్తోంది.