తెలంగాణ

అన్ని స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌లను ఆపలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ జోన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో జిఎం వినోద్‌కుమార్ యాదవ్ గురువారం సమావేశమయ్యారు. రైల్వే పెండింగ్ పనులపై చర్చించారు. జోన్ పరిధిలోని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను చిన్న స్టేషన్లలో ఆపాలని కోరారు. దీనికి స్పందించిన జిఎం వినోద్‌కుమార్ అన్ని స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడం సాధ్యం కాదని, ఇలా ఆపడం వల్ల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్యాసింజర్ రైళ్లలా మారిపోతాయని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ఎంపిలు కోరగా, మీ విజ్ఞప్తులను, ప్రతిపాదనలను పరిశీలించి రైల్వే బోర్డుకు పంపిస్తామని జిఎం తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశ పనులు వచ్చే జనవరి లోగా పూర్తవుతాయని చెప్పారు. మణుగూరు-రామగుండం రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపి బాల్కసుమన్ కోరారు. గతంతో పోలిస్తే రైల్వేలో పురోగతి కనిపిస్తుందన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని, పెద్దపల్లి, రామగుండంలో ముఖ్యమైన రైళ్లను ఆపాలని ఆయన కోరారు. ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ కాజీపేట్-యాదాద్రి మధ్య మూడో లైన్ ఏర్పాటు చేయాలని, జనగామ నుంచి రెవెన్యూ ఎక్కువగా వస్తుందని, జనగామలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని కోరారు. కాజీపేట-హైదరాబాద్ మధ్య ఇంటర్ సిటీ సర్వీసు నడపాలని, నడికుడి-బీబీనగర్ మధ్య డబుల్ లైన్ వేయాలని కోరారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో ఉచిత మంచినీరు అందించాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కోరారు. ఫలక్‌నుమా-బీబీనగర్ రైలును జనగామ వరకు పొడిగించాలని, స్టేషన్ ఘన్‌పూర్-సూర్యాపేట మధ్య రైల్వేలైన్ వేయాలని జిఎంకు ఒక వినతి పత్రం అందించారు. అదేవిధంగా కాజీపేట డివిజన్ కోచ్ ఫ్యాక్టరీపై దృష్టిసారించాలని జిఎంకు వివరించారు. ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ మాట్లాడుతూ, రైల్వే అభివృద్ధిపై వచ్చిన సూచనలు, ప్రతిపాదనలు పరిశీలించి రైల్వే బోర్డుకు అందజేస్తామని తెలిపారు.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లో ఎంపీలతో సమావేశమైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్