తెలంగాణ

సీనియర్ ఐపిఎస్‌తో పోలీసులపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 20 మందికిపైగా పోలీసు అధికారులపై విచారణ జరిపేందుకు ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే సీనియర్ పోలీసు అధికారిని నియమిస్తారు. నరుూం కేసులో అవినీతితో సంబంధం ఉన్న అనుచరులపై, నరుూం ఆగడాలు, హత్యలపై సిట్ దర్యాప్తుచేస్తోంది. కాగా పోలీసులపై వచ్చిన అభియోగాలపై కూడా దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తే పని భారం పెరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీని వల్ల అసలైన కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. సస్పెండైన పోలీసు అధికారులు శుక్రవారం తమ సిమ్ కార్డులను పోలీసు శాఖకు సరెండర్ చేశారు. ఈ కేసులో పోలీసు అధికారులు చంద్రశేఖర్, సాయి మనోహర్, ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతన్న, వెంకట్‌రెడ్డి, నరేందర్ గౌడ్, కిషన్, రవికిరణ్ రెడ్డి, వెంకటయ్య, బల్వంతయ్య, రవీందర్, సూర్యప్రకాశ్, శ్రీనివాస్ నాయుడు, శ్రీనివాసరావు, మాజిద్, కానిస్టేబుళ్లు బాలయ్య, మహ్మద్ మియాలపై అభియోగాలు వచ్చాయి. కాగా మావోయిస్టుల ఏరివేతలో చురుకుగా పాల్గొన్న పోలీసులపై నరుూం అవినీతిలో భాగం ఉందనే ఆరోపణ కారణంగా చర్యలు తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో తమపై చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇన్‌ఫార్మర్ వ్యవస్థ దెబ్బతింటుందని వేటు పడిన పోలీసులు అంటున్నారు. పైగా పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నా, వారిని వదిలిపెట్టి డిఎస్పీ, సిఐ కేడర్‌లో ఉన్నఅధికారులను లక్ష్యంగా చేసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.