తెలంగాణ

ప్రాణాలు తీసిన అతివేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మే 12: అతివేగమే అనర్థానికి దారితీసింది. ఐదుగురి ప్రాణాలు బలిగొంది. గురువారం అర్ధరాత్రి 12.30 సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఇండికా కారు బైపాస్ రోడ్డులో నిలిచివున్న లారీని ఢీకొంది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇండికాలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. కర్నూల్ జిల్లా బెల్‌గల్ మండలం చింతనొల్లపల్లికి చెందిన బత్తిన సోమేష్ (45), సోమన్న (70), నర్సమ్మ (60), గిడ్డమ్మ (60)లతో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గూడూరు గ్రామానికి చెందిన కారు డ్రైవరు మల్లేష్ (35) మృత్యువాత పడ్డారు. సోమన్న హైద్రాబాద్‌లో మేస్ర్తీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తన కొడుకు సోమేష్ వద్దకు ఇటీవల వెళ్లాడు. గురువారం ప్రమాదవశాత్తు సోమన్న కిందపడటంతో కాలు విరిగింది. చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స నిర్వహించిన తరువాత సోమన్నను స్వగ్రామానికి తరలించేందుకు అద్దెకు ఇండికా కారును మాట్లాడారు. గురువారం ఆసుపత్రి నుండి నేరుగా ఇండికా కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిచివున్న లారీని ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును అతివేగంగా నడిపించడమే ఇందుకు కారణమని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. లారీని వెనుక నుండి ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఇతర వాహనాల సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. కారును క్రేన్ సహాయంతో బయటకు తీసి మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి కిలోమీటరు మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నందిగామ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.